గురువారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనం కేసును చేదించిన రూరల్ పోలీసులు అని 11 లక్షల 43 వేల నగదు 30 గ్రాముల బంగారం హోండా షైన్ ఒక బైక్ మొబైల్ ఫోన్ నిందితుడు మీనుగా రమేష్ తండ్రి కురుమయ్య నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పి రూరల్ పోలీసులను అభినందించారు.