నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు సీఐ హనుమంత్ నాయక్ వెల్లడించారు. గురువారం సీఐతో పాటు తహశీల్దార్ పవన్ కుమార్ రెడ్డి, ఈవో ప్రకాష్ నాయుడు, ఎస్సై మల్లికార్జున రెడ్డి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. కుందూ సమీపంలో నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు.