సూర్యాపేట జిల్లా: డీజే నిర్వాహకులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తుంగతుర్తి తహసిల్దార్ దయానందం గురువారం హెచ్చరించారు. గురువారం తుంగతుర్తి లోని తహసిల్దార్ కార్యాలయంలో మండలంలోని 16 మంది బీజే నిర్వాహకులను తహసిల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. డిజె సాంగ్స్ వాడకం వల్ల జరిగే అనర్ధాలు సౌండ్స్ వాడితే తీసుకునే చర్యలపై కౌన్సిలింగ్ ఇచ్చారు .డీజిలకు అనుమతులు తీసుకోవాలని నిబంధనలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామని అన్నారు.