గుడివాడలో దిగుమతి సుంకాలపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలకు నిరసనగా శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక గుడివాడ మార్కెట్ యార్డువద్ద సీపీఎం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీరెడ్డి మాట్లాడుతూ..అమెరికా అధ్యక్షుడు మన దేశంపైపెత్తనం చేయడాన్ని మోదీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని ఆరోపించారు. అలాగె కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.