ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం సాధ్యమైనంత వరకు భరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇందులో భాగంగానే బేలా లోని పెన్ గంగా నది పరివాహక గ్రామలైన సాంగిడి, భేదోడా, మనియర్ పూర్ తదితర గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటపొలాలను పరిశీలించి, పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర మాట్లాడుతూ... వరదల వల్ల పంట నష్టపోయిన రైతులు అధైర్య పడకుండా ప్రైవేట్ అప్పులు, బ్యాంకు అప్పులు ఏమున్నా నేరుగా తనను కలిసి విన్నవించాలన్నారు