Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: బంగారు పాళ్యం మండలంలో వినాయక స్వామి విగ్రహాన్ని అవమానించిన ఘటన గ్రామంలో ఉద్రిక్తత

Puthalapattu, Chittoor | Sep 1, 2025
బంగారుపాళ్యం మండలం, కోలావారి ఇండ్లు గ్రామంలో ఆదివారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి వినాయక స్వామి వారి విగ్రహాన్ని కాలితో తన్నడంతో విగ్రహం కిందపడిపోయింది. ఈ ఘటనతో ఆలయ ధర్మకర్త నాగరాజా మరియు గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు. గుడిలో పూజలు చేస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో, ఆ వ్యక్తి ఒకరి చేతి వేళ్లను కొరికి అక్కడినుండి పారిపోయాడు. ఆలయాన్ని నిర్మించిన దాత ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇటువంటి అవమానకర చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us