వైసీపీ సోషల్ మీడియాకి టిడిపి ఎమ్మెల్యే యరపతి వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఓ కార్యక్రమంలో భాగంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాట్లాడుతూ మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వైసీపీ కార్యకర్తలు తీరు మార్చుకోకపోతే నాలుగు చీరేస్తా అంటూ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతోనే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని కూటమి అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.