కడప జిల్లా కమలాపురం పట్టణంలో శ్రీ వినాయక చవితి సందర్భంగా మూడు రోజుల పూజ కార్యక్రమాల అనంతరం నేడు శుక్రవారం వినాయకుని నిమజ్జనం పట్టణ సీఐ రోషన్ ఎస్సై విద్యాసాగర్ మరియు కాజీపేట పోలీసుల పర్యవేక్షణలో కుందూ నది, ఏటూరు వద్ద ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రజలు అక్కడ నిమజ్జన కార్యక్రమాలను చేపట్టారు. నిమజ్జనం సమయంలో ఎటువంటి ఘటనలు జరగకుండా ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేసి నిమగ్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.పట్టణ ప్రజలు ఏర్పాటు చేసిన స్థలంలోనే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.