స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడుతుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన స్త్రీ శక్తి పధకం విజయవంతమైన సందర్భంగా మంత్రి సంధ్యారాణి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీని మహిళలతో కలిసి ప్రారంభించారు. జాతీయ రహదారి గుండా వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని అక్కడ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు.