అంతకంతకూ పెరుగుతున్న వరద ఉదృతితో ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురజాపులంక, కూనాలంక గ్రామాల్లో ప్రదాన రహదారికి ఇరువైపులా శనివారం వరద నీరు చేరింది. ముంపుకు గురైతే రాకపోకలు సాగించేవారు గుర్తించేలా రహదారికి ఇరువైపులా రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఎర్రజండాలతో కూడిన కర్రలు ఏర్పాటు చేశారు.