నల్లగొండ జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలలో కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం అన్నారు. ఈ సందర్భంగా శనివారం దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ మండలం బొడ్డుపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేశారు. జిల్లా కలెక్టర్ ఇదే మండలం ముదిగొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను అకస్మికంగా తనిఖీ చేశారు.వంటగది డైనింగ్ లను పరిశీలించగా కిచెన్ లో నుండి వెళ్లే వృధా నీరు ఓపెన్ డ్రైనేజీ ఉండడం అంతేకాక వాష్ రూమ్ల ద్వారా బయటికి వెళ్లే మురుగు నీరు ఓపెన్ డ్రైనేజీ ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.