Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 25, 2025
అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప కార్య నిర్వహక ఇంజనీర్ గౌతమి అన్నారు. సోమవారం రాజవొమ్మంగి MPDO కార్యాలయంలో MPDO యాదగిరీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆదికర్మయోగి పధకం పై జరిగిన శిక్షణ తరగతిలో ఆమె పాల్గొన్నారు. మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మ్యాపింగ్, యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని ఆమె సచివాలయం తదితర శాఖల సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గ్రామాలల్లో మౌళిక వసతుల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.