ఉప్పలగుప్తం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వానపల్లి పాలెం గ్రామానికి చెందిన వీర రాఘవులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.