విజయవాడ మాచవరంలో దారుణం జరిగింది. గిరిపురం నివాసి కుమారి అనే మహిళపై కొందరు హిజ్రాలు దాడి చేయడంతో ఆమె మనస్థాపం చెందింది. తీవ్ర మనోవేదనకు గురైన కుమారి ఈ నెల 11న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.