అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మెయిన్ రోడ్ లోని హెచ్.డి.ఎఫ్. సి బ్యాంకు ఎదురుగా ఉన్న దుకాణంలో చోరీ జరిగింది.దొంగలు ఫక్రుద్దీన్ కిరాణా షాపులో తెల్లవారుజామున రేకులకు కన్నం వేసి ప్రవేశించి,సుమారు 15 వేల రూపాయల నగదు ,10 వేల రూపాయలు విలువగల సిగరెట్లను దొంగలు ఎత్తుకెళ్లినారు.పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.