యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులు సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సోమవారం సూచించారు. సోమవారం ఆలేరు మండలం బహదూర్ పేట లోని హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.