మెదక్ జిల్లా కలెక్టరేట్ కి చేరుకున్న ప్రత్యేక అధికారి హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో, జిల్లా అధికారులతో భారీ వర్షాలు వరద పరిస్థితిని చర్చిస్తున్న ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హరీష్ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు, భారీ వర్షాలు వరద పరిస్థితిని, ముంపు ప్రాంతాలను పరిస్థితిని, అలాగే వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన సహాయక కార్యక్రమాలపై ఇరిగేషన్ ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు