శక్తి యాప్తో మహిళలకు పూర్తి భద్రత లభిస్తుందని శక్తి టీం మహిళా హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ, పీసీ ధనలక్ష్మి తెలిపారు. శనివారం ఆముదాలవలస మండలం వెదుళ్లవలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ పట్ల విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఆపదలో ఉన్నా ఈ యాప్తో రక్షణ ఉంటుందన్నారు