స్థానిక సమస్యలపై అధ్యయనంలో భాగంగ మంగళవారం మధ్యాహ్నం ధరూర్ మండలంలోని నెట్టెంపాడు,నాగర్ దొడ్డి గ్రామాలలో ప్రజలను కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు లోని ఎస్సీ కాలనీలో వేపచెట్టు నర్సమ్మ ఇంటి ముందర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరిన పట్టించుకోలేదని,దీనివల్ల సుమారు రెండు లక్షల పైగా విలువ చేసే 14 మూగ జీవాలు మృతి చెందాయని,వర్షాకాలంలో ఎర్త్ వల్ల పరిసర ప్రాంతాలలో తీవ్ర భయందోళనలకు గురి అవుతున్నామని తమ దృష్టికి తెచ్చారని అన్నారు.