విఘ్నేశ్వరుడి రూపంలో ప్రపంచ అఖ్యాతిగాంచిన రామప్ప రామలింగేశ్వర స్వామి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని రామలింగేశ్వర స్వామి నేడు బుధవారం రోజున విఘ్నేశ్వరుని రూపంలో దర్శనమిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు హరీశ్ శర్మ స్వామివారిని గణపతి రూపంలో అలంకరించారు. స్వామివారికి ఉదయమే అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.