కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తుందని టి పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.కామారెడ్డి పట్టణంలో 12 గంటల సమయంలో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పేమీ లేనప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్లు కాలేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పిందన్నారు. అలాంటి సమయంలో హరీష్ రావును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. అలాగే కవిత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కవితను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని అన్నారు.