నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు గల మురికి కాలువలో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన ఒరగంటి సంతోష్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ గత మూడు రోజుల క్రితం తాగిన మత్తులో తన ఇంటి నుండి బయటకు వెళ్లాడని, మృతుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీ నీటిలో పడి మునిగి చనిపోయి ఉండవచ్చన్నారు. మృతదేహం చాలా కుళ్ళిపోయిన స్థితిలో ఉందని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంతోష్ మరణంలో కుట