గుత్తి జీ ఆర్ పీ పరిధిలోని జక్కలచెరువు సమీపంలో తమీం ఎజాజ్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి కి చెందిన అతను జక్కల చెరువు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. జీ ఆర్ పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.