పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి లో నిర్మించిన గృహ నిర్మాణాల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా వీధిలైట్లు, త్రాగునీరు, రహదారులు, తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.