జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లాకలెక్టర్లతో పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టరేట్‌లోని శంకరన్ హాలు నుంచి కలెక్టర్ ఆనంద్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు