పేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా చితికిపోయిన వారికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాను కల్పిస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.