కాగజ్నగర్ కు కొత్త రైళ్లను తీసుకువచ్చానని చెప్పే సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు రైతుల కోసం యూరియా ఎప్పుడు తెస్తారని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్ల శ్రీకాంత్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేయడం కాకుండా కేంద్రం నుంచి యూరియా తీసుకురావాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే సమస్యలు పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు,