కడప జిల్లా బద్వేల్ లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం ప్లేట్లు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.పాఠశాల హెడ్ టీచర్ ఓరుగంటి శశికళ, ఉపాధ్యాయులు మానుగుంట రవిశంకర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్ధక సంఘం కమిటీ మెంబర్ దేవతి సుబ్బారావు శీలం వారి పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం ప్లేట్లు వాటర్ బాటిల్స్ వితరణ కార్యక్రమాన్ని వారి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.