ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుని మనందరం రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్.విజయకుమార్, మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ డా విజయకుమార్, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ లు పాల్గొన్నారు