ఆధ్యాత్మికతోనే సమాజంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులకు దాతలు సహకరించాలని కోరారు.