జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తరిగొప్పల మండలంలోని ఆగ్రోస్ సేవ కేంద్రాన్ని,పలు ఫర్టిలైజర్ షాప్ లను కలెక్టర్ సందర్శించారు.స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.ఎంత మందికి ఎన్ని బస్తాలు అమ్మారు అని ఆయా రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి తదితర వివరాలను చెక్ చేశారు.అమ్మకాలు పూర్తి అయ్యేంత వరకు ఫర్టిలైజర్ షాప్ యజమానులు సరిపడా సిబ్బంది ని పెట్టుకొని... రైతులకు ఇబ్బంది కలిగించ వద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.