గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కలెక్టర్ సర్క్యూలర్ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డైలివేజ్ వర్కర్స్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, జీతాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే కలెక్టర్ సర్కులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు.