రావులపాలెం మండలం రావులపాడులో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. సురేష్, రాజ్ కుమార్ మధ్య ఘర్షణ జరగ్గా రాజ్ కుమార్ కు కత్తిపోట్లు తగిలాయి. 108లో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుట్లు వేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.