పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూరు సమీపంలో చిల్కటోని పల్లి వాగు నుండి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఏలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలించడంతో తహాసిల్దార్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు ట్రాక్టర్ ,జెసిబిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఆర్ఐ తిరుపతయ్య తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి లేకుండా వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు