మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి అన్నారు.మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని చెప్పారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు.