నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సారంగాపూర్ మండలం వంజర్ గ్రామంలోని బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోయా, వరి తదితర పంటలు పూర్తిగా వర్షార్పనమయ్యాయి. ప్రభుత్వం, అధికారులు స్పందించి బాధితులకు నష్టపారిహారం అందించాలని గ్రామస్తులు గురువారం కోరారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.