నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలానికి సంబంధించి నేపాల్లో ఎవరైనా ఉంటే వారి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వాలని తహశీల్దార్ నాగమణి బుధవారం తెలిపారు. నేపాల్లో జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా నేపాల్లో ఉంటే అటువంటి వారి వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారని తెలిపారు. మన మండల పరిధిలో నేపాల్లో ఎవరైనా ఉంటె వారి వివరాలను అందజేయాలన్నారు.