నిజాంసాగర్ లో పర్యటించిన జిల్లా ఎస్పీ.. వరద ఉదృతి పూర్తిగా తగ్గేవరకు ప్రయాణాలు చేయకూడదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయన నిజాంసాగర్ లో పర్యటించారు. వరద నీటికి ధ్వంసమైన బొగ్గు గుడిసె, చిన్న పూల్ ను ఆయన పరిశీలించారు. అనంతరం గొర్గల్ గేటు వద్ద ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడుతూ వారికి పండ్లు, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్స్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు.