దేవనకొండ మండలం సిఐటియు కార్యాలయంలో రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ బుధవారం గుమ్మనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యాలను ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడే హక్కు ప్రజా సమయంలో ఉందని, అయితే గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ కోసం ప్రజల భూములను సేకరిస్తున్న నేపథ్యంలో మాట్లాడేందుకు వెళ్లిన రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డికి మండలానికి రావాల్సిన అవసరం ఏముందని ఇక్కడి నుంచి వెళ్లక పోతే, పరిణామాలు వేరేలా ఉంటాయని, గుమ్మనూర్ జయరాం వారి అనుచరుల ఫోన్ ద్వారా హెచ్చరించడానికి ఖండించారు.