గద్వాల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు మంగళవారం ఉదయం యూరియా కోసం ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్న రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. తగినంత యూరియా సరఫరా చేయాలని పేర్కొంటూ అక్కడ వరుసలో చెప్పులు పెట్టి అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేశారు. ప్రభుత్వం రైతులకు సరిపడా ఏరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.