నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణకు గ్రామపంచాయతీ అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా శుక్రవారం ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న పలు దుకాణాలపై ఆకస్మిక ధరలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న కొందరిని గుర్తించి వారికి జరిమాణాలు విధించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బంది హెచ్చరించారు