నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏనుగు మరి గ్రామ సమీపంలో ఆటోను ఓ ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మొదట డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది