టాటా ఏస్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో స్పాట్లోనే వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టనంలోని వెంపేట్ రోడ్ (పాత బీసీ హాస్టల్) సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం డీ కోని వెంపేట గ్రామానికి చెందిన మగ్గిడి నరసయ్య 68 అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మెట్పల్లి పోలీసు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.