ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామం చెంచు కాలనీలో క్షయ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యాధి బారిన పడితే ఊపిరితిత్తులు లోపల చెడిపోయి ఆయాసం దగ్గు బరువు తగ్గిపోతారని తెలిపారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల అధికమవుతుందని పేర్కొన్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చని అవగాహన కల్పించారు.