జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలో కంచెలో ఉంచిన గొర్రె పిల్లల మంద పై కుక్కల దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గొర్రెల కాపరి ఈశ్వర్,కొండూరు సాయి రైతులకు చెందిన 40 గొర్రె పిల్లలు మృతి చెందగా సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.