నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బస్ స్టేజ్ వద్ద ఉన్న అండర్ పాస్ లోకి చేరిన వర్ధనీటితో బుధవారం ప్రయాణికులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇనుపాముల సమీపంలో ఉన్న ఏఎంఆర్పి మైనర్ కాలువ కల్వర్టు ధ్వంసం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాలువ నుంచి నీరు అండర్ పాస్ లోకి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు స్థానికులు కోరుకుంటున్నారు.