విశాఖపట్నం, అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో మంగళవారం ఒక కొండచిలువ కలకలం సృష్టించింది. స్టేడియం నెట్‌లో చిక్కుకుని ఉన్న ఆ కొండచిలువను ఒక వ్యక్తి గమనించి, వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. కిరణ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను నెట్ నుండి బయటకు తీసి రక్షించారు. ఈ సందర్భంగా, పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని, వెంటనే తనకు తెలియజేయాలని కిరణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.