నాగారం మున్సిపాలిటీ పరిధిలోని విఎస్టి, సాయిబాబా కాలనీలలో జలమండలి ఏఈ సాయి కిరణ్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి తో కలిసి వాటర్ పైప్లైన్లు, వాటర్ కనెక్షన్లపై సర్వే నిర్వహించారు. కలనివాసులకు వాటర్ కనెక్షన్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజు సుఖ్నగర్ కాలనీ అధ్యక్షుడు దాస్, వి ఎస్ టి కాలనీ అధ్యక్షుడు మనోహర్ పాల్గొన్నారు.