భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందించడంలో విఫలం చెందిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దాహనం చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.