జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మున్సిపాలిటీలోని భరత్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు అన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసి, ముఖ్యంగా చిన్న పిల్లల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నామని వర్షాలు పడినప్పుడు నీరు వీధుల్లో నిలిచిపోతోందని,చిన్న పిల్లలు బురదలో నడుస్తూ స్కూల్‌కు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు.